అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలి: బాబు

హైదరాబాద్‌: ప్రభుత్వం తక్షణం అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. గతంలోనే అప్రెంటిస్‌ రద్దుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం, దాన్ని అమలు చేయకుండా మోసం చేస్తుందని దుయ్యబట్టారుఏ. ఈ విధానాన్ని రద్దు చేసే వరకు ఉపాధ్యాయులు చేసే ఉద్యమాలకు తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరా పార్కు వద్ద యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరానికి వచ్చిన చంద్రబాబు వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu