బాబు సీఎం కావాల‌ని కృష్ణ సైకిల్ యాత్ర‌

మాయాబ‌జార్ చూడ్డానికి బండ్లు క‌ట్టుకుని థియేట‌ర్లకు వెళ్లారు, శ్రీ‌కృష్ణ‌తులాభారం చూడ్డానికి ఒకాయ‌న ఊరుగాని ఊళ్లో మూడు రోజులు ఉండిపోయాడు, స‌చిన్ సెంచ‌రీకోసం పూజ‌లు చేశారు, ధోనీ క‌ప్పుకొట్టాల‌ని దేవుళ్ల‌ని మొక్కుకున్నారు, చిరంజీవి సినిమా కోసం క‌టౌట్ల గొడ‌వ‌ల్లో ఆస్ప‌త్రిపాల‌య్యారు, టిడీపీ అధికారంలో వ‌చ్చింద‌ని ఒకాయ‌న వూరంతా స్వీట్లు పంచారు. అదుగో అంత‌టి వీరాభిమాని కృష్ణ త‌న అభిమాన నాయ‌కుడు నారా చంద్ర‌బాబు అధికారంలోకి రావాల‌ని సైకిల్ యాత్ర చేస్తూ హైద‌రాబాద్ చేరుకున్నాడు. ఇది న‌ర‌న‌రాల ఉన్న వీరాభిమానం. స్వ‌త‌హాగా వ‌చ్చినది, దీనిలో క‌ల్తీ ఉండ‌దు. అది చంద్ర‌న్న పాల‌న ప్ర‌భావం. ఇది ఇప్పుడు వీస్తున్న గాలి. అంద‌రూ తెలుగు దేశంపార్టీ అధికారంలోకి రావాల‌నే కోరుకుం టున్నారు. చంద్ర‌న్నపాల‌న‌లో మ‌ళ్లీ కాలం గ‌డ‌పాల‌నుకుంటున్నారు. జిల్లాల్లో అనేకానేక‌మంది  జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇచ్చి పొర‌ పాటు చేశామ‌నే అనుకుంటున్నారు. 

కరాచి కృష్ణ  అనే అభిమాని ప్రజా చైతన్య సైకిల్ యాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టారు. 26 జిల్లాల్లో చేపట్టిన ఈ యాత్ర ఆదివారం రావుల పాలెం చేరుకుంది. ఈ సందర్భంగా కృష్ణకు రావులపాలెం మండలం, టీడీపీ అధ్యక్షుడు గుత్తల రాంబాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సతీష్ రాజు ఘనస్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో అవకతవకలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈసారి ప్రత్యేకంగా స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ను ప్రస్తావించారు. ఎటువంటి వివరాలు లేకుండా పిడి (వ్యక్తిగత డిపాజిట్) ఖాతా (ఎస్‌డిసి) నుండి రూ. 10, 895.67 కోట్లు (మూడు వేర్వేరు బిల్లుల ద్వారా) డ్రా చేసిన‌ట్టు పిఎజి ఎత్తి చూపింది. అన్ని ప‌థ‌కాల అమ‌ల్లోనూ తప్పిదాలతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొట్టికాయ‌లు వేయించుకుంది. రాజ‌ధాని విష‌యంలోనూ ప్ర‌జ‌ల ఆశ‌లు దెబ్బ‌తిన్నాయి. మూడు రాజ‌ధాను ల‌ని అంద‌ర్నీ సందిగ్ధంలో ప‌డేసి, చివ‌రికి అస‌లు హోదా కూడా రావ‌డం కూడా క‌ష్ట‌మ‌న్న‌ది కేంద్ర‌మే తేల్చేసింది. ప్ర‌జ‌ల్ని ఇంకా మ‌భ్య‌పెట్ట‌డానికి ఎంపీలు మాత్రం హోదా అవ‌కాశాలున్నాయ‌ని చె్పిస్తున్నారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నించి, విని విసిగెత్తారు. త‌మ పొర‌పాటు గ్ర‌హించి మ‌ళ్లీ చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వాన్ని కోరుకుంటున్నారు. 

కరాచి కృష్ణ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని, 2024లో చంద్రబాబు సీఎం కావాలని రావుల పాలెం టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తాను చేస్తున్న సైకిల్ యాత్రకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోందని, ఎంతో మంది మహిళలు, తనలో స్ఫూర్తి నింపుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తన సైకిల్ యాత్ర ఆగదని, అంతవరకు తన ఇంటికి కూడా వెళ్లనని స్పష్టం చేశారు. జూన్ 29న మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభమైనట్లు కృష్ణ తెలిపారు.