16 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. హాకీ కాంస్యం ప‌ట్టిన భార‌త్‌

కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీజట్టు అదర గొట్టింది. కాంస్య పతకం కోసం నేడు (ఆదివా రం) న్యూజి లాండ్‌ తో జరిగిన పోరులో 2-1తో విజయం సాధించి 16 ఏళ్ల నిరీక్ష ణకు తెరదించింది. ఆస్ట్రేలి యాతో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో మ్యాచ్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణ యం కారణంగా ఫైనల్స్‌కు చేరుకోలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు నేడు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అభిమానుల మనసులు దోచుకుంది. గేమ్ మరి కాసేపట్లో ముగుస్తుందనుకున్న సమయంలో గోల్ చేసిన న్యూజి లాండ్ స్కోర్‌ను సమం చేసింది. దీంతో పెనాల్టీ షూటవుట్ తప్పలేదు. ఇందులో న్యూజిలాండ్ ఒకే ఒక్క గోల్ సాధించగా, భారత్ రెండు గోల్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌ హాకీలో భారత్‌కు ఇది మూడో పతకం కాగా, చివరి సారి  2006లో పతకం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పతకం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 

భారత మహిళల హాకీ జట్టు షూటౌట్‌లో 2-1తో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తన ప్రాభ‌వాన్ని గొప్ప‌గానే ముగించింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్పాల్ , అబ్దుల్లా అబూబకర్ ద్వారా భారత్ చారిత్రాత్మక స్వర్ణం మరియు రజతాన్ని కూడా గెలుచుకుంది. భారత బాక్సర్లు నీతూ ఘంఘాస్ మరియు అమిత్ పంఘల్ వరుసగా మహిళల 48 కేజీలు, పురుషుల 51 కేజీలలో స్వర్ణాలు గెలుచుకు న్నారు, చివరి రోజు కూడా భార‌త్ ప‌త‌కాల ప‌రుగు కొనసాగింది.