టిఆర్ ఎస్‌కు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రాజీనామా

తెలంగాణాలో సోద‌రుల‌కు ఏమ‌వుతున్న‌దో తెలీదు. మొన్న‌నే కాంగ్రెస్ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యారు. కార‌ణాలు, లెక్క‌లు ఎలా ఉన్నా తాజాగా టీఆర్ ఎస్ నుంచి ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఒకాయ‌నేమో మునుగోడు ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోస‌మే చేశాన‌న్నాడు. ఈయ‌నేమో త‌న‌కు అస‌లు పార్టీలో గుర్తింపేలేద‌న్న వేద‌నతోనే రాజీనామా చేశాన‌న్నారు. ప్ర‌జాసేవ‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి టీఆర్ ఎస్‌లో నిస్వా ర్ధంగా ఇన్నాళ్లూ చేసిన సేవ‌కు క‌నీస గుర్తింపు కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని, సంస్కారం లేని నాయ కులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని, వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు 7న రాజీనామా చేస్తానని ముందే చెప్పిన ప్రదీప్ రావు టీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే ఏమీ జ‌ర‌గ‌ద‌ని, అందుకే ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ముందే స్పష్టం చేశారు. వరంగల్‌లో తన నివాసంలో ఇటీవ‌ల‌ ఆయన వరంగల్‌తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుచ రులతో సమవేశంలోనే త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివరికి తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టించే పరి స్థితులు వచ్చాయని, ఇంత జరుగుతున్నా అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని పేర్కొన్నారు. 

ఉద్య‌మ‌స‌మ‌యంలో, త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీని, అధిష్టానాన్నీ న‌మ్మ‌కున్నందుకు త‌న‌కు అవ‌మానాలే త‌ప్ప ఆద‌ర‌ణ లభించలేద‌ని ఇక ఆద‌రించే పార్టీలో చేరాల‌నుకుంటున్నామ‌ని ప్ర‌దీప్‌రావు అన్నారు. ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు వార్తలు రావడంతో  ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ దూత‌లుగా  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మెట్టు శ్రీనివాస్  ప్రదీప్ నివాసానికి వెళ్లి మాట్లాడారు. పార్టీ మారవద్దని బుజ్జగించే యత్నం చేశారు. అంతేకాకుండా, సీఎం కేసీ ఆర్ మాట్లాడించేందుకు ప్ర‌య‌త్నించినా ప్రదీప్ రావు మాట్లాడలేదని తెలి సింది. ప్రదీప్ రావు నుంచి ఎలాంటి సానుకూల స్పం దన రాకపోవడంతో సారయ్య, శ్రీనివాస్‌ వెనుదిరిగారు. చెప్పినట్టుగానే ఆగస్టు 7న ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా చేశారు.