బాబుపై విచారణ కాంగ్రెసు కుట్రే: మురళీమోహన్

విజయనగరం: బాబుపై సిబిఐ విచారణ ఖచ్చితంగా కాంగ్రెసు కుట్రేనని దానిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని  జయభేరి సంస్థ అధినేత, సినీ నటుడు మురళీమోహన్అన్నారు. అవినీతిపరుడినని నిరూపిస్తే తాను అసెంబ్లీ ఎదుట ఉన్నా చెట్టుకు ఉరి వేసుకుంటానని తీవ్రంగా స్పందించారు.తాను అప్పట్లో ప్రభుత్వం నుండి సెంటు భూమి కూడా తీసుకోలేదన్నారు.అవినీతి పరుడిని కానని నిరూపించకపోతే తనకు క్షమాపణలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పులివెందుల శాసనసభ్యురాలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ వెనుక కేంద్రం హస్తం ఉందని ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్  విజయనగరం జిల్లాలో అన్నారు.బాబు కేసులో ఆదేశాలు ఇచ్చిన జడ్జిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన ఆదేశాలపై అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు.

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అన్నాహజారేతో సమానుడన్నారు. ఒకప్పుడు బంగారు కంచాల్లో తిన్న వారుఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నారని విమర్శించారు.  కొందరు పారిశ్రామిక వేత్తల కుట్ర కూడా ఉందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, రాజీనామాలు అని ప్రజా ప్రతినిధులను విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu