ప్రజల గుండె చప్పుడు వినాలన్నకలతో: జగన్
posted on Nov 20, 2011 12:17PM
గుంటూ
రు: ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్లి పల్లెల్లో నిల్చుని ధైర్యంగా సమస్యలు చెప్పమని ప్రజల గుండె చప్పుడు వినలన్నకలతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు,వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ ఈ కాంగ్రెసు ప్రభుత్వం మాత్రం ప్రజల గుండె చప్పుడు వినకుండానే రచ్చబండను కేవలం మండల కేంద్రాలకు పరిమితం చేస్తోందని తన ఓదార్పు యాత్రలో విమర్శించారు. కొద్దొ గొప్పో ఇవ్వాలనుకున్నవి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పేదలకు రెండు వేల ఇళ్లు ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇస్తారట ఇది ప్రజలను మోసం చేసేందుకే అని ధ్వజమెత్తారు.
రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా కాంగ్రెసు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాదన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు తమ కుళ్లు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం పని చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం కరవు మండలాలకు నిధులు ఇవ్వడం లేదని, పేద పిల్లల చదవులతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు.