పోటాపోటీగా లండన్ ఎన్నికల ఫలితాలు... పడిపోతున్న పౌండ్ విలువ
posted on Jun 9, 2017 11:08AM

బ్రిటన్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఊహలన్నీ తారుమారయ్యేలా కనిపిస్తోంది. ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించి.. ఈసారి కూడా థెరిసా మే ప్రధాని అవుతారన్న అంచనాలు తారుమారయ్యాయి. ఇరు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఏ పార్టీకి మెజార్టీ ఫలితాలు దక్కకపోతుండటంతో పౌండ్ కూడా కుదుపులకు లోనవుతోంది. మొత్తం 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్ లో మ్యాజిక్ ఫిగర్ 326 స్థానాలు. అయితే 318 సీట్లతో కన్జర్వేటివ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని బీబీసీ అంచనావేసింది. కానీ పోల్ ఫలితాలు మాత్రం ఆశ్చర్యకరంగా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ ఎలక్షన్ ప్రభావం పౌండ్ విలువపై పడుతుంది. ఫలితాలు పోటాపోటీగా వస్తుండటంతో పౌండ్ స్టెర్లింగ్ 1.27 డాలర్లకు పడిపోయింది. యూరోకు వ్యతిరేకంగా కూడా పౌండ్ విలువ ఒకశాతం మేర పడిపోతోంది. జనవరి తర్వాత ఇదే అతిపెద్ద పతనమని తెలిసింది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా ట్రేడర్లు స్పందిస్తున్నారు.