శానిటైజర్ ఫైర్.. బాలుడు మృతి.. 

పిల్లలు అన్నతర్వాత ఆటలు సహజం. కొన్నిసారు ఎంత చెప్పిన వినకుండా.. పెద్దల మాటలు పట్టించుకోకుండా.. గేమ్స్ ఆడుతుంటారు..ఇక ఆ ఆటల మీద పడితే తిండి నిద్రలు ఉండవు వాళ్ళకి. అలా సరదాగా ఆదుకునే ఆటలే కొన్నిసార్లు ప్రాణాల మీదికి వస్తుంటాయి.. ఆలా ప్రమదాహానికి గురై చనిపోయిన పిల్లల వీడియోలు మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తుంటాం.. అయితే తాజాగా సరదా ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. శానిటైజర్ మంటలకు పసివాడు బలైపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చిలోని ఈబి రోడ్‌లోని భారతినగర్‌లో నివాసం ఉంటున్న బాలమురుగన్ చిన్న కొడుకు శ్రీరామ్. 8వ తరగతి చదువుతున్నారు.  శ్రీరామ్  తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ ఆటలో భాగంగా తన సహచర మిత్రులకు జాక్ ఫ్రూట్ విత్తనాలను ఉడకబెట్టి ఇవ్వాలని అనుకున్నాడు. ఇందుకోసం పొయ్యి ఏర్పాటు చేసేందుకు కట్టెలు, రాళ్లను సేకరించాడు.

కింద మీద పది చివరికి కట్టెల పొయ్యిని ఏర్పాటు చేశాడు. మిగతా స్నేహితులు ఇతర పదార్థాలు తీసుకురాగా.. శ్రీరామ్ పొయ్యిని వెలిగించే పనిలో పడ్డాడు. అయితే, చెక్కలకు మంటలు అంటుకోకపోవడంతో.. శ్రీరామ్ తన ఇంటి నుంచి శానిటైజర్ బాటిల్ తీసుకువచ్చాడు. కట్టెలపై పోసి నిప్పు పెట్టాడు. అప్పుడు చిన్నగా మంట అంటుకోవడంతో ఆ మంటను మరింత పెంచేందుకు శ్రీరామ్ ఆ శానిటైజర్‌ను నేరుగా మంటలపై స్ప్రే చేశాడు. ఇంకేముంది ఒక్కరిగా  ప్రమాదవశాత్తు ఆ మంటలు శానిటైజర్ బాటిల్‌కు అంటుకున్నాయి. దాంతో  శ్రీరామ్ చేతిలో ఉన్న ఆ శానిటైజర్ బాటిల్ పేలింది. ఈ పేలుడు ధాటికి శ్రీరామ్‌కు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న శ్రీరామ్‌ని గమనించిన స్థానికులు.. వెంటనే అతనిపై నీరు పోసి మంటలను ఆర్పేశారు. పక్కవాళ్ళు ఎప్పుడు చూశారో ఏమో అప్పటికే కాలిపోయిన శ్రీరామ్ ని  తిరుచ్చిలోని ఎంజిఎంజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో.. శ్రీరామ్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు శానిటైజర్‌ను దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, బాలుడు మృతిలో అతని కుటుంబంలో పెను విషాదం నెలకొంది. బాలుడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో చోటు చేసుకుంది.