'విచారణలో పాలేంటో నీళ్లేంటో తేలిపోతుంది '

న్యూఢిల్లీ :  సీబీఐకి తాము ఎందుకు భయపడాలని సీబీఐ అంటే దెయ్యమా...భూతమా? అని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. సీబీఐ తనిఖీలు నిర్వహించి వివరాలు అడుగుతుందని ఆయన అన్నారు. 25 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని సుజనా చౌదరి తెలిపారు.సీబీఐ విచారణపై వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తాను వ్యతిరేకమని. కంపెనీ లా ప్రకారం అయితే కోర్టుకు వెళ్లే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. సీబీఐ విచారణలో పాలేంటో నీళ్లేంటో తేలిపోతుందని ఆయన అన్నారు.