డబ్బు సంపాదించే భలే మార్గం.. ఇంట్లోనే ఇలా కరెంట్ ఉత్పత్తి చేసి అమ్మవచ్చు..!


ప్రపంచం మొత్తం ఇప్పుడు విద్యుత్ గుప్పెట్లో చిక్కుకుంది.  ఒక్క నిమిషం విద్యుత్తు లేకపోతే చాలా సతమతం అయిపోతారు. ఇంట్లో వంట వండే రైస్ కుక్కర్ల నుండి, స్నానం చేయడానికి వాడే గీజర్.. ట్యాంక్ లో నీళ్లు నింపే మోటర్, ఇంట్లో ఫిడ్జ్, టీవీ,  ఫ్యాన్,  మొబైల్ ఫోన్.. ఇలా ప్రతి ఒక్కటి కరెంట్ ఆధారంగా పనిచేసే  వస్తువులే ఉంటున్నాయి. దీని వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. సాధారణంగా చలికాలం కంటే వేసవి కాలంలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. వందలు, వేల కొద్ది విద్యుత్ ఛార్జీలు భరించలేక ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారు. అయితే ఇంటి వద్దనే విద్యుత్ ఉత్పత్తి చేసి అటు కరెంట్ బిల్ తప్పించుకోవడమే కాకుండా.. ఎంచక్కా విద్యుత్ అమ్మి డబ్బు సంపాదించవచ్చు.  దీనికోసం ఏం చేయాలో తెలుసుకుంటే..


ప్రభుత్వ మద్దతు..


ఇంటి పట్టునే విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024,  ఫిబ్రవరి 13వ తేదీన సూర్యఘర్ యోజన ను ప్రారంభించారు.  ఈ పథకం కింద ఇంట్లోనే విద్యుత్ వినియోగానికి ప్రభుత్వం నుండి సబ్సీడీ కూడా లభిస్తుంది. ఈ పథకం కింద రూఫ్ టాఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పటు చేసుకోవచ్చు.  ఇలా ఏర్పాటు చేసుకునేందుకు కోటి కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.15వేలు లభిస్తుంది.


సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి పథకానికి సంబంధించిన పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.  యూజర్ ఐడీ,  పేరు,  అడ్రస్,  ప్లాంట్ సామర్థ్యం వంటి వివరాలు అన్నీ అందులో పూరించాలి. దీని తర్వాత డిస్కమ్ కంపెనీలు పోర్టల్ లో పొందుపరిచిన వివరాలు అన్నీ దృవీకరించి ప్రాసెస్ ను ముందుకు తీసుకెళ్తాయి.  సౌలభ్యాన్ని బట్టి కొనుగోలు దారులను ఎంచుకోవచ్చు.


ప్యానెల్ లు ఇన్ స్టాల్ చేసిన తర్వాత డిస్కామ్ నెట్ మీటరింగ్ ను ఇన్స్టాల్ ఇస్తుంది.  అప్పుడు సర్టిఫికెేట్ పోర్టల్ లో అప్ లోడ్ చేయబడుతుంది. దీని తర్వాత ప్రభుత్వం  సబ్సీడీ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఇన్వర్టర్ బ్యాటరీలలో నిల్వచేసి విద్యుత్ ను విక్రయించవచ్చు. ప్రభుత్వం సబ్సీడీ రావడమే కాకుండా విద్యుత్ ను యూనిట్ చెప్పున ధర చెల్లించి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.  దీనివల్ల ఆదాయం బాగుంటుంది.


                                              *రూపశ్రీ.

 

Related Segment News