పెళ్ళి బస్సు బోల్తా... 30 మందికి గాయాలు

 

కడప జిల్లా ముద్దనూరు వద్ద ఆదివారం ఉదయం పెళ్ళి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. పెద్ద ముడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి 50 మంది ప్రయాణికులతో పులివెందులకు బయల్దేరిన పెళ్ళిబస్సు ముద్దనూరు సమీపంలోని ఎత్తులోకట్ట మలుపు వద్ద బోల్తా పడింది. మితిమీరిన వేగం కారణంగానే ఈ బస్సు బోల్తా పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం.