వాట్స్ అప్ పై హైకోర్టు లో రచ్చ...
posted on Apr 27, 2021 3:35PM
వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు పొట్టే అభ్యంతర పోస్టులకు అడ్మిన్ బాధ్యుడు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వాట్సాప్ గ్రూపు అడ్మిన్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసులు కొట్టివేస్తూ కోర్టు ఈ వాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వాఖ్యలు చేసింది. గ్రూప్ అడ్మిన్ కు సభ్యులను చేర్చే, తొలగించే పరిమితమైన అధికారులు మాత్రమే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఇతర సభ్యులు చేసే పోస్టులను నియంత్రించే, సమీక్షించే అధికారాలను అడ్మిన్ కు ఉండవని ఈ సందర్భంగా కోర్టు వాఖ్యానించింది.
అసలు ఈ కేసు విషయానికి వస్తే.. ఓ గ్రూపులో కొందరు వ్యక్తులు మహిళా సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినా ఆ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న కిశోర్ తరోనే(33) స్పందించలేదని, ఆ సభ్యులను గ్రూప్ నుంచి తొలగించలేదని దిగువ కోర్టులో ప్రాసిక్యూషషన్ ఆరోపించింది.
కనీసం క్షమాపణ కూడా కోరలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై ఐపీసీ 354, 509, 107 సెక్షన్ల కింద, ఐటీ చట్టం 67వ నిబంధన కింద కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ అడ్మిన్ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది. గ్రూపులో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేస్తే అతను మాత్రమే చట్టపరమైన చర్యలకు బాధ్యుడు అవుతాడని కోర్టు స్పష్టం చేసింది.