లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ ఎంట్రీ... కలవరంలో అమెరికా..!


ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే లాడెన్ ను అమెరికా మట్టుబెట్టి ఐదు సంవత్సరాలు అయిన సంగతి కూడా విదితమే. అయితే ఈ ఐదు సంవత్సరాల తరువాత మళ్లీ అమెరికా భయపడే విషయం ఒకటి బయటపడినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు మరణించాడని భావిస్తున్న బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ వీడియోలో కనిపించడంతో అమెరికా కలవరపడుతోంది. తాజాగా ఆల్ ఖైదా విడుదల చేసిన వీడియోల అధినేత అల్ జవహరి తరువాత హమ్జా మాట్లాడి తీవ్రవాదుల్లో స్పూర్తి నింపేప్రయత్నం చేశాడు. ఇరాక్ సిరియాల్లో ఉండే తీవ్రవాదులంతా ఏకంకావాలని ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. దీంతో మెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అతని గురించిన వివరాల కోసం ఆరాతీస్తున్నాయి.

 

మరోవైపు అయితే ఈ వీడియోలో ఆయన మాట్లాడలేదని, గొంతు ఆయనది కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హమ్జా పిలుపుతో తీవ్రవాదులు ఏకమైతే అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.