రైల్వే స్టేషన్‌ను తగలబెట్టిన మావోయిస్టులు..

 

ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈరోజు మరో దారుణానికి పాల్పడ్డారు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్‌.. బస్తర్‌ జిల్లాలోని కుమార్‌చాట్రా రైల్వే స్టేషన్‌ను తగలబెట్టారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలిని పరిశీలించి.. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు.