పడిలేచిన కెరటాలు...ఏపీలో పవన్ బీహార్‌లో చిరాగ్

 

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్  లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే పోత్తులో భాగంగా పోటీ చేసిన 5  ఐదు ఎంపీలు విజయం సాధించి పట్టు నిలుపుకున్నాది. సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు. 

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు పైగా పోటీ చేసి కేవలం ఒకేఒక స్ధానంలో గెలిచారు. బాబాయ్‌తో విభేధాలు 2021లో పార్టీ చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. ఈ విజయాన్ని ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనసేన విజయంతో పోలుస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. ఎన్డీయేలోని కీలక పార్టీలైన బీజేపీ 43 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం మరో 49  స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జేడీయూ 17 స్థానాల్లో గెలిచి మరో 61 స్థానాల్లో లీడ్‌లో ఉంది. 

మహాగఠ్‌బంధన్ 31 సీట్లలో ముందంజలో ఉంది.విపక్ష ఆర్జేడీ 26, కాంగ్రెస్ 3, వామపక్షాలు 2 సీట్లలో గెలుపును ఖాయం చేసుకోగా, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఏఐఎంఐఎం 6, ఇతరుల ఒక స్థానంలో అధిక్యంలో ఉంది.నితీష్ కుమార్ వరుసగా తొమ్మిదో సారి బిహార్ సీఎంగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ ప్రణాణస్వీకారానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే 205 సీట్లలో జయకేతనం ఎగురవేసింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu