బీహార్ లో కనీసం బోణీ కొట్టని ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత చందంగా తయారైంది ప్రశాంత్ కిశోర్ పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి తన వ్యూహాలు, ప్రణాళికలతో  ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమత సర్కార్ కొలువుదీరడానికీ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణం అనడంలో సందేహం లేదు. అయితే ఆయన స్వయంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి తన సొంత రాష్ట్రం బీహార్ లో పోటీ చేస్తే.. పాపం ఘోర పరాజయమే ఎదురైంది. 

జనసురాజ్ పార్టీ స్థాపించి స్వరాష్ట్రంలో కింగ్ లేదా కనీసం కింగ్ మేకర్ గానైనా నిలుద్దామన్న ప్రశాంత్ కిశోర్ ఆశలకు బీహార్ జనం గండి కొట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలలో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ వారిలో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారు.  రాష్టరంలోని మొత్తం 243 స్థానాల్లో జనసురాజ్ అభ్యర్థులు నిలబడినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. సోంత పార్టీ జన సురాజ్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఇసుమంతైనా పని చేయలేదు.   అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం తొలి అడుగులోనే చతికిల పడిందని నెట్టింట సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu