బిహార్‌‌లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం... బీజేపీకి అత్యధిక స్థానాలు

 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి 199 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దాదాపు 203 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 90 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 82 సీట్లు గెలిచాయి. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్‌జేపీ 18 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో కొనసాగుతుంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 35  స్థానాల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. 

ఆర్జేడీ 23 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ ఐదు స్థానల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌లో బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న ఆర్జేడీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని పార్టీల కంటే ఆర్జేడీ ఓటు బ్యాంకు ఎక్కువగా నమోదైంది. తాజా ఫలితాల్లో ఆర్జేడీకి 22.9 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 20.1 శాతం, జేడీయూకు 19.24 శాతం ఓట్లు వచ్చాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఆమె బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు సృష్టించారు. అలీనగర్ నుంచి ఆమె తన సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.రాఘోపూర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. 1,04,065 ఓట్లు సాధించిన ఆయన.. ప్రత్యర్థి బీజేపీ నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu