కేసీఆర్‌కి అనారోగ్యం
posted on Jan 24, 2015 6:29AM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన జలుబు, జ్వరం, గొంతునొప్పి కారణంగా ఆయన కదల్లేని పరిస్థితిలో వున్నారు. దాంతో శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న 66వ జాతీయ ఔషధ రసాయన సదస్సుకు హాజరు కాలేకపోయారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభం కావలసి వుంది. శుక్రవారం మధ్యాహ్నం సీఈఓల సదస్సులో కూడా సీఎం పాల్గొనాల్సి వుంది. శుక్రవారం ఉదయం పదింబావు వరకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆ తర్వాత జ్వరం, జలుబు, గొంతునొప్పి కారణంగా ఆయన ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సదస్సుకు హాజరయ్యారు. సీఈఓల విందు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మొత్తమ్మీద సీఎం కేసీఆర్ అనారోగ్యం కారణంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. శుక్రవారం సాయంత్రానికి కొద్దిగా కోలుకున్న కేసీఆర్ కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.