బీహార్ ప‌వ‌న్ చిరాగ్ పాశ్వాన్!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ల శ్ర‌మ ఆపై రెండు ఎన్నిక‌ల ప్ర‌యోగాలు చేసి, అటు పిమ్మ‌ట మూడో ఎన్నిక‌ల్లో సాధించిన హండ్రెడ్ పర్సెంట్ విక్ట‌రీ ఇచ్చిన ఇన్ స్పిరేష‌న్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాకిందా అంటే.. ఔననే చెప్పాల్సి వస్తోంది. 

త‌మిళ‌నాడులో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి  ప‌వ‌నే అతి  పెద్ద ఇన్ స్పిరేష‌న్ గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ లోని చిరాగ్ పాశ్వాన్ విజయం సైతం సైతం ప‌వ‌న్ హండ్రడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ తోనే పోలుస్తున్నారు. గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో 21 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ  సీట్ల‌ను ఎలా కైవ‌సం  చేసుకున్నారో.. అక్క‌డ బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ 75 శాతం స్ట్రైక్ రేట్ తో ప‌వ‌న్ ని తలపింపచేశారని పరిశీలకులు అంటున్నారు. 

బీహార్ గ‌త కాల‌పు రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రైన రామ్ విలాస్ పాశ్వాన్ వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ లోక్ జ‌న  శ‌క్తి పార్టీని ముందుకు తీస్కెళ్తున్న యువ కెర‌టం  చిరాగ్ పాశ్వాన్. ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ  29 సీట్ల‌కు పోటీ చేయ‌గా వాటిలో 19 స్థానాలలో విజయం సాధించింది. 

గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఐదు ఎంపీ  సీట్ల‌ను గెలిచింది. దీంతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా చిరాగ్ పాశ్వాన్ దూసుకెళ్తున్నారు. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  చిరాగ్  సైతం బీహార్ లో ప్ర‌భావం చూపుతున్న‌ట్టుగా చెబుతున్నారు చాలా మంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu