Bench Life web series review: బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ రివ్యూ

 

వెబ్ సిరీస్ : బెంచ్ లైఫ్
నటీనటులు: వైభవ్, చరణ్, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ , నయన్ సారిక, వెంకటేష్ కాకమాను, తనికెళ్ళ భరణి తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్
మ్యూజిక్: పికే దండి
నిర్మాతలు: నిహారిక కొణిదెల
దర్శకత్వం: మానస శర్మ
ఓటీటీ: సోని లివ్

కథ: 

బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. ముగ్గురు స్నేహితులు. ఆ ముగ్గురికి బెంచ్ కావాలి. సేమ్ ఆఫీసులో ఇషా (ఆకాంక్ష సింగ్) అంటే బాలుకు ఇష్టం. ఆమెను తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తున్నా ఆ విషయం చెప్పలేదు. ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా చెప్పలేకపోతాడు. మీనాక్షికి డైరెక్టర్ కావాలని కోరిక. కథలు రాసుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతుంది. భార్య (నయన్ సారిక), స్నేహితులతో కలిసి గోవా వెళ్లాలని రవి ప్లాన్ చేస్తాడు. అందుకు బెంచ్ అడుగుతారు. బెంచ్ వచ్చిన తర్వాత ఏమైంది? ఐపీఎస్ ఉద్యోగం వదిలేసి కంపెనీలో చేరిన ప్రసాద్ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్) ఎవరు? డైరెక్షన్ కలలు వదిలేసి పెళ్లి చేసుకోమని తల్లి (తులసి) సంబంధాలు తీసుకొస్తే మీనాక్షి ఏం చేసిందనేది ఈ సిరీస్ కథ‌.

విశ్లేషణ:

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి ఈ వెబ్ సిరీస్ నచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సిరీస్ మొత్తం అయిదు ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రతీ ఎపిసోడ్ నలభై నిమిషాలతో మొత్తంగా మూడు గంటల ఇరవై నిమిషాలు ఉంటుంది‌. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్ గా ఏం ప్రాబ్లమ్ ఉండదు కానీ తెలుగులో వల్గర్ వర్డ్స్ అయితే చాలానే ఉన్నాయి. 

బెంచ్ లైఫ్ తో కామెడీగా మొదలై లైఫ్ ని బెంచ్ తోనే ఆపేయకు అంటు ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు మేకర్స్. అలాగే సిరీస్ చివరలో ఓ‌ క్వశ్చన్ కూడా ఉంటుంది. 'ఒక చిన్న ఫ్యామీలీ స్టోరీ' అనే  సిరీస్ ని డైరెక్ట్ చేసిన మానస శర్మనే ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసింది. జాబ్ అండ్ పర్సనల్ లైఫ్ కి మధ్య నలిగిపోయే పాత్రలో రితిక సింగ్ కనెక్ట్ అవుతుంది. మూడు, నాలుగు ఎపిసోడ్‌లు కాస్త సాగదీతగా ఉంటాయి‌. అలాగే బాలు, ఈషా రోల్స్ యొక్క లవ్ ని ఇంకాస్త వివరించి ఉంటే బాగుండేది. 

మొదటి ఎపిసోడ్: కోడ్ ఎర్రర్.. నలభై రెండు నిమిషాలు ఉంటుంది‌. చాలా ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్. ఎవరెవరు మెయిన్ లీడ్‌‌.. మిగతా ఎపిసోడ్‌లు ఎలా ఉంటాయో చూపించే ఎపిసోడ్ ఇది. రెండో ఎపిసోడ్ ఫైర్ వాల్.. ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది. మొదటి ఎపిసోడ్ లో క్యారెక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కి కొనసాగింపు అని చెప్పొచ్చు. ఇదే ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ గారు ఎంట్రీ ఇస్తాడు. మూడో ఎపిసోడ్ డీబగ్గింగ్... నలభై నిమిషాలు ఉంటుంది. మధ్యలో ల్యాగ్ సీన్లు చాలానే ఉంటాయి. నాల్గో ఎపిసోడ్ టెస్టింగ్.. మొదటి నుండి చివరి వరకు సాగదీసిన‌‌ ఎపిసోడ్ ముగింపులో అందరిని కనెక్ట్ చేస్తారు. అయిదో ఎపిసోడ్.. ది రియల్ బెంచ్.. ముప్పై తొమ్మిది నిమిషాలు ఉన్న ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. అన్నింటికి కన్ క్లూజన్ ఇస్తారు‌. వైభవ్ నటన వల్ల ఆయా సన్నివేశాలు నవ్వించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: బాలుగా వైభవ్ రెడ్డి ఆకట్టుకున్నాడు. రవిగా చరణ్ పెరి, మీనాక్షిగా రితిక సింగ్, ఈషాగా ఆకాంక్ష సింగ్ తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : యూత్ ని ఆకట్టుకునే 'బెంచ్ లైఫ్'.. వన్ టైమ్ వాచెబుల్ ఫర్ కామన్ ఆడియన్స్ 

రేటింగ్: 2.75 /5 

✍️. దాసరి  మల్లేశ్