ఎస్సై ప్రభాకరర్‌రెడ్డి ఆత్మహత్యలో ట్విస్ట్.. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు కారణం..?
posted on Jun 14, 2017 5:35PM

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ప్రభాకరర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శ్రీకృష్ణానగర్‌లో శిరీష అనే బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. శిరీష ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నది. అయితే బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు ప్రభాకర్ రెడ్డి కారణమంటూ కథనాలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి ప్రభాకర్ రెడ్డి బ్యూటీ పార్లర్ కు వచ్చాడని.. అక్కడ శిరిషను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభాకర్ రెడ్డి వేధింపుల వల్లే శిరిష ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక శిరీష ఆత్మహత్యతో భయాందోళనకు గురైన ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.