బత్తిన సోదరుల చేప మందుకు చిక్కు

హైదరాబాద్: బత్తిన సోదరుల చేప మందు మరోసారి వివాదంలో చిక్కుకుంది. పిల్లలకు చేప మందు వేయకుండా ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం మానవ హక్కుల సంఘానికి (హెచ్ఆర్‌సికి) విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై హెచ్ఆర్‌సి మంగళవారం స్పందించింది. పిల్లలకు చేపమందు వేయడం వల్ల అంటువ్యాధులు వస్తాయని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు చేపమందు వేయకుండా చూడాలని హెచ్ఆర్‌సి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీనిపై జూన్ 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. చేపమందు ఆశాస్త్రీయమని, అది హక్కుల ఉల్లంఘనే అవుతుందని బాలల హక్కుల సంఘం వాదిస్తోంది. జూన్ 8వ తేదీన మృగశిర కార్తె మొదటి రోజు చేపమందు ఇవ్వడానికి బత్తిన సోదరులు సిద్ధపడుతున్నారు. మృగశిర కార్తె మొదటి రోజు బత్తిన సోదరులు చేపమందు ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. ఈ మందు కోసం దేశ, విదేశాల నుంచి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నవారు వస్తుంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu