అదునపు కట్నం కోసం భర్త ప్లాన్.. ఏం చేశాడో తెలుసా..?

కరోనా పేరు చెపితే కొందరు బయపడుతుంటే.. ఇంకొందరు మరణిస్తున్నారు. మరికొందరు ఆ కరోనా ని వ్యాపారం చేసుకుంటున్నారు. కరోనా మందుల పేరా బ్లాక్ దందా చేస్తున్నారు.  అంతే కాదు కరోనా ని ఎవడి తోచినట్టు వాడు వాడుకుంటున్నారు. ఇంకొంత మంది ఎలా వాడు కుంటున్నాడో మీరే చూడండి. తాజాగా ఒక వ్యక్తి  భార్యను పుట్టింటికి వెళ్లి ఓ ఆరు లక్షలు తీసుకురమ్మన్నాడు భర్త. దీంతో భార్య అందుకు ఒప్పుకోలేదు. ఆమెను ఇంట్లోనే ఓ గదిలో నిర్బంధించాడు. చుట్టుపక్కల వాళ్లు అడిగితే.. ఆమెకు కరోనా సోకిందని చెప్పాడు. కరోనా వచ్చినప్పుడు వెళ్లి తీసుకురావచ్చుకదా అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్.. ఆ ట్విస్ట్ ఏంటో మీరే తెలుసుకోండి.. 
 
వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టకు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. లాక్‌డౌన్‌లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. పుట్టింటి నుంచి రూ.6 లక్షలు తీసుకురావాలని భార్యను ఒత్తిడి చేశాడు. దీంతో తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమేనంటూ ఆమె అతడికి చెప్పింది.దీంతో ఆమెను చాలా రోజుల పాటు ఓ గదిలో నిర్బందించాడు. చుట్టుపక్కల వారు భార్య ఏదని అడిగితే.. కరోనా సోకిందని, ఐసొలేషన్‌లో ఉంచానని బుకాయించాడు.

అయితే ఈ విషయాన్ని గమనించిన ఒకరు సనత్‌నగర్‌లోని మెట్రోపాలిటన్‌ న్యాయసేవా విభాగానికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో వారు కలగజేసుకుని.. రంగంలోకి దిగి ఇంటికి వెళ్లి ఆమెకు విముక్తి కలిగించారు. ఆసుపత్రిలో పరీక్ష చేయించగా.. భార్యకు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. అనంతరం ఆమెను పుట్టింటికి పంపారు. ఆ తరువాత పోలీసులకు, కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కోర్టు సూచనతో భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎట్టకేలకు అతను.. తప్పును సరిదిద్దుకుని భర్త భార్యను కాపురానికి తీసుకెళ్లాడు.