నేను లేకపోబట్టే ప్లాప్ సినిమాలు తీస్తున్నారు  

పవన్ కళ్యాణ్(pawan kalyan)సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో  బండ్ల గణేష్(bandla ganesh)మాటలకి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్(gabbar singh)అందుకు అంకురార్పణ చేసిందని చెప్పవచ్చు. ఆ మూవీ నుంచి మొదలయిన  బండ్ల మాటల ప్రస్థానం స్టిల్ నేటి వరకు ఒక రేంజ్ పంచులతో కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా కూడా తన మాటల సునామీతో ప్రకంపనలు సృష్టించాడు.

సెప్టెంబర్ 2 న  పవన్ కళ్యాణ్ బర్త్ డే  సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతుంది. పరమేశ్వర ఆర్ట్స్  క్రియేషన్స్ పై బండ్ల గణేష్ నిర్మించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.ఈ  సందర్భంగా మీడియా సమావేశం జరగగా  హరీష్ శంకర్(harish shankar)తో పాటు బండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భగా బండ్ల తనదైన స్టైల్లో మాట్లాడుతు నేను రన్నింగ్ లో లేకపోవడం వల్లే హరీష్, పూరిజగన్నాధ్ (puri jagannadh)ప్లాప్ సినిమాలు తీస్తున్నారు. నేను రంగంలోకి దిగి ఆ ఇద్దరితో హిట్ సినిమాలని చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.

హరీష్ ఇటీవల రవితేజ(ravi teja)తో మిస్టర్ బచ్చన్ తో ప్లాప్ ని అందుకోగా, రామ్(ram pothineni)హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ తో పూరి ప్లాప్ ని అందుకున్నాడు. వీళ్ళద్దరు  బండ్ల నిర్మాణ సారథ్యంలో వచ్చిన గబ్బర్ సింగ్, టెంపర్ కి దర్శకత్వం  వహించారు. ఆ రెండు చిత్రాలు వాళ్ళ  కెరీర్ కి ఎంతగానో  హెల్ప్ అయ్యాయి.