బాచుపల్లి ప్లాట్ల వేలంలో హెచ్ఎండీఏకు షాక్

 

బాచుపల్లి ప్లాట్ల వేలం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. గజానికి రూ.70,000గా కనీస ధర నిర్ణయించడంతో కొనుగోలుదారులు వెనుకడుగేశారు. హైదరాబాద్‌–బాచుపల్లిలో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లు ఉంచగా, ఒక్కటీ అమ్ముడుపోకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అదే సమయంలో తుర్కయాంజల్‌ ప్రాంతంలో 12 ప్లాట్లు వేలం వేసి, కేవలం రెండు మాత్రమే అమ్ముడవ్వడం నిరాశ కలిగించింది. అధిక ధరలే ప్రధాన కారణమని కొందరు వ్యాఖ్యానించగా, ప్రభుత్వ సంస్థలపై విశ్వాసం తగ్గిపోవడమే అసలు సమస్య అని మరికొందరు విశ్లేషకులు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu