త్రివిక్రమ్ పై బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) ను అభిమానులు 'గురూజీ' అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి త్రివిక్రమ్ పై తాజాగా బాబు గోగినేని (Babu Gogineni) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ అనే వాడు గురూజీ కాదని, డర్టీ ఫెలో అని విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం తెలుగునాట యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumanthu) వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫన్ పేరుతో మహిళలు, చిన్నారులపై అతను చేసే దారుణ వ్యాఖ్యలపై.. సామాన్యుల నుంచే కాదు, సెలెబ్రిటీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం సైతం అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో.. ప్రణీత్ లాంటి వారికి, త్రివిక్రమ్ కి తేడా లేదంటూ బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు గోగినేని.. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా స్నేహితుడితో కలిసి గుంటూరు కారం సినిమా చూస్తుండగా.. అందులో ఒక సీన్ లో హీరో మహేష్ బాబు, హీరోయిన్ తో అంటాడు. 'గుడ్డు ఏంటి ఇంత చిన్నగా ఉంది.. నువ్వు పెట్టావా కోడి పెట్టిందా" అని. ఆ డైలాగ్ వచ్చాక ఇక ఆ సినిమా చూడటం ఆపేశాం. ఆ డైలాగ్ రాసినోడిని గురూజీ అంటారంట కదా. ఆ త్రివిక్రమ్ అనేవాడు ఆ డర్టీ డైలాగ్ రాస్తే, మహేష్ బాబు అనేవాడు అది చెప్పాడు. వీరందరూ డర్టీ ఫెలోసే. ఆడవారి పట్ల ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు. మరి దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు." అంటూ బాబు గోగినేని ఘాటుగా స్పందించారు.