ఆయషా రీపోస్ట్ మార్టంకి సీబీఐ రంగం సిద్ధం......

పన్నెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి తెరమీదికొచ్చింది. ఆయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. ఈ నెల 20 లోగా పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా హత్య కేసు సంచలనం రేపింది.2007 డిసెంబర్ లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లోని ఓ ప్రైవేటు కళాశాల హాస్టళ్లు, ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైంది. హత్య చెయ్యడానికి ముందు ఆమె పై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధరించారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సత్యం బాబు అనే యువకుడిని గుర్తించారు. సత్యంబాబుకి జైలు శిక్ష విధించారు. అయితే ఈ కేసులో సత్యంబాబును న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఆయేషా కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తును సీబీఐ చేపట్టింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించుకుంది కానీ అది సాధ్యపడలేదు. సీబీఐ పై నిషేధం ఎత్తివేయడంతో ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో పునర్విచారణను వేగవంతం చేయాలని సిబిఐ నిర్ణయించుకుంది. ఈ కేసులో ఇప్పటికే 12 ఏళ్ళ పాటు జాప్యం జరిగింది ప్రధాన నిందితుడిగా గుర్తించిన సత్యం బాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. దీంతో సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికీ గుంటూరు రెవిన్యూ అధికారులతో సిబిఐ మాట్లాడి, తెనాలిలో ఆయేషాను ఖననం చేసిన ప్రాంతానికి సీబీఐ వెళ్లనుంది. ఇప్పటి కైనా ఆయేషా హత్య కేసులో అసలు దోషుల సిబిఐ గుర్తిస్తోందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.