మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ 

మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదైంది. 78 ఏళ్ల తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పోలీసుల విచారణకు, హైకోర్టు విచారణకు హాజరుకాలేనని మోహన్ బాబు లిఖిత పూర్వకంగా వినతి చేశారు. జల్ పల్లి నివాసం వద్ద జరిగిన తోపులాటలో మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. తండ్రి కొడుకుల వివాదం చర్చనీయాంశం కావడంతో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.  ప్రతీ రెండు గంటల కోసారి మోహన్ బాబు ఇంటి వద్ద భద్రతను సమీక్షించాలని హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. ఈ నెల 24వ తేదీ వరకు విచారణ వాయిదాపడింది. తనకు ప్రాణ హాని ఉందని మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.