కుటుంబ సమేతంగా హస్తినకు బయలు దేరిన రేవంత్ రెడ్డి 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈసారి ఆయన  కుటుంబ సమేతంగా హస్తినకు వెళ్లారు.  రేవంత్ తొలుత  ఢిల్లీకి వెళ్లారు. అక్కడ్నుంచి  రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి.. జైపూర్ లో ఉండనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి . కాగా.. బుధవారం  శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు. అక్కడి నుంచి జైపూర్‌కు వెళ్లనున్నారు. జైపూర్‌లో తమ బంధువుల వివాహ వేడుక ఉండగా.. దానికి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. జైపూర్‌లో వివాహ కార్యక్రమానంతరం.. రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి చేరుకోనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు మంత్రి పదవి చోటు దక్కించుకోని వారికి కేబినెట్ లో చోటు లభించనుంది.  ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగానే.. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉండటంతో.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్‌మున్షీ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండన్నట్టు సమాచారం.