బాధితులకు జగన్ రాబందు పరామర్శ!

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడిన అనేకమంది అనకాపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలకు గురైన వాళ్ళందరూ బాధతో మూలుగుతున్నారు. వాళ్ళని ఆ పరిస్థితిలో చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతలో ఏదో హడావిడి... అన్నొచ్చాడు.. అన్నొచ్చాడు.. అని అరుపులు. అప్పుడు అక్కడకి ప్రవేశించాడు సదరు అన్న.. ఆ అన్న ఎవరో కాదు.. రాజకీయ రాబందు, శవరాజకీయాల ఎక్స్.పర్ట్ జగనన్న. ఈయనగారు లోపలకి రావడం రావడమే షిక్కటి షిరునవ్వుతో వచ్చాడు. మంచాల మీద బాధతో మూలుగుతున్నవాళ్ళ దగ్గరకి వెళ్ళి కిలకిలా నవ్వుతూ పలకరించాడు. కన్నీరుమున్నీరు అవుతున్న బంధువులను ‘హాయ్.. హవ్వార్యూ.. పార్టీ బాగా జరుగుతోందా’ అన్నట్టుగా నవ్వుతూ పలకరించాడు. అక్కడ జగన్ పరిస్థితి ఎలా వుందంటే, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చినట్టుగా లేదు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత సెలవులకి మేనమామ ఇంటికి వెళ్ళి, అక్కడున్న మరదలిని చూసి సిగ్గుపడుతున్న కుర్రాడిలా వుంది. ఆ షిక్కటి షిరునవ్వేంటో... ఆ సిగ్గుపడటం ఏంటో... ‘జగన్‌కి మెంటల్’ అని ఎవరైనా అంటే, ‘తప్పు.. అలా అనకూడదు’ అని వారించేవారికి కూడా డౌట్ వచ్చేలా జగన్ పరిస్థితి వుంది. మొత్తమ్మీద క్షతగాత్రులు, క్షతగాత్రుల బంధువులు ఈ నవ్వుల నత్తిపకోడీని చూసి బిత్తరపోయారు.

‘పరామర్శ’ అనే ఈ నవ్వుల ప్రహసనం ముగిసిన తర్వాత ఎప్పట్లాగే ఈ శవాన్వేషకుడు జగన్ మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో చెత్తవాగుడంతా వాగాడు. అసలు విషయాన్ని వదిలేసి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ పథకంలో విఫలమైంది... ఈ పథకంలో విఫలమైంది అంటూ సంబంధం లేని టాపిక్‌ని అక్కడ వాంతులు చేసుకుని, ఆ తర్వాత అందరికీ తన షిక్కటి షిరునవ్వుతో నమస్కారాలు పెట్టుకుంటూ, ‘హమ్మయ్య.. నా శవాల ఆకలి తీరింది’ అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.