కేసీఆర్ చెప్తేనే జగన్ చేశారు..

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే జగన్ ఓటుకు నోటు కేసుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దీనిని స్పీకర్ కోడెల తిరస్కరించడంతో రోజూలాగే స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేస్తూ ఓటుకు నోటు కేసుపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
 

 

దీంతో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ ఓటుకు నోటు కేసుపై తీర్మానం ఇవ్వడం వెనుక ఉన్న సూత్రధారి కేసీఆరే అని.. కేసీఆర్ చెప్తేనే జగన్ తీర్మానం ఇచ్చారని మండిపడ్డారు. నిన్నకేసీఆర్ జగన్ కు ఫోన్ చేసి ఇంకా సభలో ఓటుకు నోటు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగినట్టు తెలిసిందని.. అందుకే వైసీపీ ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొచ్చిందని దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మావద్ద ఉన్నాయని తెలిపారు. దీన్ని బట్టే అర్ధమవుతోందని.. కేసీఆర్ జగన్ లు ఓకేసులో కుట్ర పన్నారని అన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు.. కోర్టు అనుమతిస్తే సభకు రాలేని జగన్ కు కేసుల గురించి ప్రస్తావించే అర్హత లేదని విమర్శించారు.