టీటీడీ బోర్డులో తెలంగాణ టీడీపీ నేత..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా మరో తెలంగాణ నేతకు అవకాశం దక్కింది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డిని సభ్యుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నేతలందరూ పార్టీని వీడినా తాను అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్నానని..కాని తనను ఎవరూ గుర్తించడం లేదని సాక్షాత్తూ అధినేత వద్దే వాపోయారు. దీనిపై స్పందించిన చంద్రబాబు త్వరలో టీటీడీ సభ్యుడిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు.