నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు..

నెల్లూరు జిల్లాను భూకంపాలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తూ జనాన్ని వణికించింది. తాజాగా ఇవాళ కూడా మరోసారి భూప్రకపంనలు చోటు చేసుకున్నాయి. వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు, సీతారామపురం మండలాల్లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.0గా నమోదైంది.