అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన ఏపీ విద్యార్థిని

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినులు గాయపడ్డారు. వారిలో ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన దీప్తి వంగవోలు, ఆమె స్నేహితురాలు గాయపడ్డారు. గుర్తు తెలయని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

వారిని ఢీ కొట్టిన వాహనం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పారిపోయాడు. ఈ ప్రమాదంలో దీప్తి తలకు బలమైన గాయం తగిలింది. ఆమెకు శస్త్ర చికిత్స జరుగుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో  విద్యార్థిని క్షేమంగా ఉంది.  డెంటన్‌ పోలీసులు ఈ హిట్‌ అండ్‌ రన్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించాల్సి ఉంది.