బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కి సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పుట్టినరోజు  సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.    తెలంగాణ సీఎంవో అఫీషియల్ ఎక్స్  అకౌంట్ ద్వారా రేవంత్ రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అనుక్షణం ప్రజాసేవలో నిమగ్న మవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు రాజాసింగ్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని  రేవంత్ ఆకాంక్షించారు.  

బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్  హిందువులు, గోవుల రక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతూ అనేక కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల కాలంలో రాజాసింగ్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నారు.  ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే   అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాజాసింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.