భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఏపీ పోలీసులు...

 

ఈ మధ్య కాలంలో మత్తు ద్రవ్యాల విక్రయం అధికమవుతోంది. ప్రభుత్వం ఎన్ని సోదాలు, ఎన్ని తనిఖీలు చేపట్టినా మత్తు ద్రవ్యాల రవాణాకు అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రభుతం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ద్రవ్యాల రవాణా తగ్గుముఖం పట్టదని స్పష్టమవుతోంది.సాధారణంగా మనకు ఎక్కువ మోస్తారు లో పట్టుబడేది గంజాయి. కృష్ణా జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 

ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్ పరిధిలోని పొట్టిపాడు టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా టెంపో ట్రావెల్స్, మినీ బస్ లో గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబట్టారు. అరకు నుండి కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు వెళ్తున్న టెంపో ట్రావెలర్స్ మినీ బస్ లో గంజాయి తరలిస్తున్నారు. దాదాపు రెండు వందల నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పది మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు గన్నవరం పోలీసులు. 

మరో వైపు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నలభై కేజీల గంజాయి పట్టుబడింది. దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.వీరి పై కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి మత్తు పదార్ధాలు ఎంతటి ప్రమాదకరమో తెలియజేసే చర్యలు చేపట్టేలా పోలీసుల చర్యలు తీసుకోవాలి. పోలీసులు తనిఖీలు ఇంకాస్త ముమ్మురం చేయ్యాలని ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు చేపడితే కానీ వీటిని నిష్క్రమించలేమని వెల్లడవుతోంది.ఇక జగన్ సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.