ఆరు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిది
posted on Aug 1, 2015 12:07PM
రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే హైకోర్టును విభజించాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడ హైకోర్టు విభజన సాధ్యం కాదని.. ఏపీ ప్రభుత్వం అక్కడ హైకోర్టును నిర్మించుకున్న తరువాత విభజన కుదురుతుందని న్యాయస్థానం టీ సర్కారుకు సూచించింది. ఏపీ హైకోర్టు బాధ్యతను కేంద్రంపై పెడుతూ.. దానికి కావలసని అనువైన స్థలాన్ని.. నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రం భరించాలని సూచించింది. కానీ న్యాయస్థానం అయితే చెప్పింది కానీ కేంద్రం మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లోపు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని.. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరస్పరం సంప్రదించుకోవాలని తెలిపింది. ఏపీలో హైకోర్టు ఎక్కడ నిర్మించుకోవాలి.. దానికి అనువైన ప్రదేశం ఎక్కడో చూసి హైకోర్టు న్యాయమూర్తికి తెలపాలని.. న్యాయమూర్తి ఏపీ మంత్రులతో కలిసి చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.