అవినీతిని సహించేది లేదు.. చంద్రబాబు
posted on May 23, 2015 5:27PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాది పాలన సందర్భంగా సచివాలయంలో కలెక్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించేది లేదని, అధికారులు నీతిగా పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్లను పనిలో వేగం పెంచాలని సూచించారు. రుణమాఫీ ప్రక్రియను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని, రైతు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఉద్యోగులకు బదిలీ అనేది ఒక వేధింపు కాకూడదని, మాట విననప్పుడు మాత్రమే అది చివరి అస్త్రం కావాలని అన్నారు. అంతేకాకుండా ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలకుండా గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని, అవసరమైనవారికి మజ్జిగ కూడా అందించాలని సూచించారు.