ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా సంజయ్ జగన్ సర్కార్ మెప్పు కోసం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యవహరించారు. జగన్ కనుసన్నలలో ఆయన ఆడమన్నట్లల్లా ఆడి, పాడమన్నట్లల్లా పాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సంజయ్ హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ వైసీపీ ప్రైవేటు సైన్యంలా పని చేసింది. అయితే ఇప్పుడు పాపం పండింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సంజయ్ కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇఫ్పుడు ఆయననై సస్పెన్షన్ వేటు వేసింది.   అలాగే సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది.

దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. ఈ వ్యవహారంలోనే ఆయన ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు. పనులు జరగకుండానే పెద్ద ఎత్తున నిధులను దిర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్...నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.