మరో తీవ్రవాద సంస్థ నుంచి ఈమెయిల్

న్యూఢిల్లీ: నిన్నటి బాంబు పేలుడుపై దర్యాప్తు చేస్తున్న జాతీయ భద్రతా సంస్థ ఈరోజు మరో కొత్త ఈమెయిల్ పై దృష్టి సారించింది. తీవ్రవాద దాడికి ఇండియన్ ముజాహిదీన్ సంస్థదే బాధ్యత అని కొత్త ఈమెయిల్ పేర్కొంటోంది. పాకిస్థానీ లష్కరే తోయిబా సంస్థకి చెందిన ఇండియన్ ముజాహిదీన్ మంగళవారం మరో పేలుడు సంభవించనుందని ఈ మెయిల్ లో హెచ్చరించింది. ప్రజాప్రయోజనవ్యాజ్యాలను విచారించే బుధవారం కోర్టుకి ఎక్కువమంది వస్తారు కాబట్టి కావాలనే బుధవారం బాంబు దాడికి పాల్పడినట్లు కూడా మెయిల్ లో పేర్కొన్నారు. ఈ ఈమెయిల్ నిజమైనదా కాదా అని తేల్చుకునే దిశగా జాతీయా భద్రతా సంస్థ దర్యాప్తు మొదలుపెట్టింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu