ఆంధ్రప్రదేశ్ కు మరో వాయు‘గండం’?

ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అన్నట్లుగా ఒకదాని వెంట ఒకటిగా తుపానులు రాష్ట్రంపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను కారణంగా మరో నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు భారీ నుంచి అతి భారీ వర్షాల గండం ఉందని పేర్కొంది

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న  ఆవర్తనం  ప్రభావంతో  వచ్చే  24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్ప పీడనం బలపడి ఆ నెల23 నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఈ తుపాను 24వ తేదీన  తీవ్ర తుపానుగా మారి 25వ తేదీన ఒడిశా, లోని గోపాలపూర్‌, పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25తేదీలలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ల రాదనీ హెచ్చరించింది.