వయనాడ్ లో బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకను ఓడించనుందా? 

వయనాడ్​లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై , రాష్ట్ర బీజేపీ మ‌హిళా మోర్చా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌వ్య హ‌రిదాస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇద్దరు మహిళా నేతల మధ్య  నువ్వా నేనా  అనే  పోరు నెలకొంది. భారతీయ జనతా పార్టీ వయనాడ్ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌(39) పేరును కన్ఫర్మ్ కావడంతో  ఆమె  రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. కాలికట్ యూనివర్సి నుంచి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు నవ్య. ప్రస్తుతం కోజీకోడ్ కార్పొరేషన్​లో బీజేపీ కార్పోరేటర్ గా ఉన్నారు . వరుసగా ఆమె రెండు సార్లు కార్పోరేటర్ గా ఉన్నారు 
2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  ఓ సారి కోజీకోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్​డీఏ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ దేవర్కోవిల్ చేతిలో ఓడిపోయారు. తాజాగా వయనాడ్ లోక్​సభ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. కాగా,ఆమె పై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. గాంధీ కుటుంబం  వయనాడ్ ను సెకండ్ ఆప్షన్ గా ఎం చుకుందన్నారు  నవ్యహరిదాస్ .