ఏపీ క్యాబినెట్ భేటీ.. అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం (మార్చి 17) మధ్యాహ్నం భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో అమరావతి పనులు సహా పలు కీలక నిర్ణయాలకు, బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ లో పెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేస్తుంది.  

అదే విధంగా ఇప్పటికే సీఆర్డీయే ఆమోదం తెలిపిన అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 22 వేల 607 కోట్ల రూపాయలతో 22 పనులకు సీఆర్డీయే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ పనులకు ఇప్పుడు కేబినెట్ పచ్చ జెండా ఊపుతుంది.  వీటితో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి ఓకే చేయనుంది.  అదే విధంగా  సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన  టెండర్ల పనులు చేపట్టేందుకు  ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.  క్యాబినెట్ అమోదం తెలిపిన తరువాతే  టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను సీఆర్డీయే జారీ చేయాల్సి ఉంటుంది.  

అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు,  అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశం ఉ:ది.   ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ , దాల్మియా సిమెంట్స్,  లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్, ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థలు రాష్ట్రంలో చేయనున్న ఇన్ వెస్ట్ మెంట్లకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది.