ఏపీ రాష్ట్ర బడ్జెట్ ఈరోజే
posted on Mar 12, 2015 8:58AM
.jpg)
రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబోతోంది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్ రూ 1.13 లక్షల కోట్లు ఉండబోతోంది. అందులో ప్రణాళికా వ్యయం రూ.33 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.80 వేల కోట్లు ఉంటుందని సమాచారం. ఈ సారి బడ్జెట్ లోటు రూ.15,350 కోట్లు ఉంటుంది. నవ్యాంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బడ్జెట్ రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ అందుకు కేంద్రం సహాయం కూడా చాలా అవసరమని, లేకుంటే రాష్ట్రం పూర్తిగా నిలద్రోక్కుకోలేదని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర విభజనతో ఆర్ధికంగా బాగా దెబ్బతిని ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇదివరకు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18,522 కోట్ల మేర పెండింగ్ బిల్లులను అప్పగించి చేతులు దులుపుకొనిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నేడు ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ లో ప్రజలకు ఎటువంటి వరాలు కానీ, వడ్డింపులు గానీ ఉండబోవని ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు తెలిపారు.