కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరగాలి...!


ఇంకా కొద్దిసేపట్లో బలపరీక్ష జరుగుతుంది... ఓటింగ్ జరుగుతుంది.. ఏపార్టీ అధికారం చేపడుతుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూడటం... కానీ అందరికీ షాకిస్తూ యడ్యూరప్ప రాజీనామా చేయడం...దాంతో లైన్ క్లియర్ అవ్వడంతో కుమాస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రైడీ అయ్యారు. ఇక  ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని.. ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదని... ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల కలయికపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... ప్రజాతీర్పు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉందని... కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. కులం, మతం కార్డులతో ఓటర్లను ఆ పార్టీ ప్రలోభపెట్టిందని... అన్ని రకాలుగా నిబంధనలను ఉల్లంఘించిందని విమర్శించారు.