బాంబు పేలుడులో కలెక్టర్ మృతి

బాంబు పేలిన ఘటనలో జిల్లా కలెక్టర్ మృతి చెందారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్ చెర్చినోలో జరిగింది. కలెక్టర్ మహ్మద్ ఇస్మాయిల్ హక్యార్ తన భద్రతా సిబ్బందితో కలిసి కార్యాలయానికి వెళుతుండగా దారిలో అమర్చిన బాంబు పేలింది. ఈ పేలుడులో కలెక్ట్రర్ తో పాటు ఆయనతో ఉన్న భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఈ ప్రమాదంలో కలెక్టర్ స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో అతనిని ఆస్పత్రికి తరలించినట్టు ఉర్వజ్గన్ ప్రావెన్స్ గవర్నర్ మహ్మద్ నయాబ్ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇంత వరకూ ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని మహ్మద్ నయాబ్ అన్నారు.