జెత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ రిమాండ్ 

ముంబై నటి  కాదంబరి జెత్వాని కేసులో  అండర్ గ్రౌండ్ లో ఉన్న    వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ను  14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు.  విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ లో ఉండి ముంబై తదితర నగరాల్లో కుక్కల విద్యాసాగర్ తలదాచుకున్నాడు.డెహ్రాడూన్ నుంచి  పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించి రిమాండ్ కు పంపారు. 
 జెత్వానీపై  అప్పట్లో బడా పారిశ్రామికవేత్త జిందాల్  రేప్ చేసిన నేపథ్యంలో అతనిపై రేప్ కేసు నమోదైంది. ఈ రేప్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ బడా పారిశ్రామిక వేత్త అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శరణు జొచ్చాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ పారిశ్రామికవేత్త అత్యంత సన్నిహితుడు. ఈ పరిచయాన్ని ఉపయోగించుకునే జిందాల్ జగన్ పంచన చేరారు. నేరం చేసిన జిందాల్ కు శిక్షపడే అవకాశాలున్నప్పటికీ జగన్ ఆ రేపిస్ట్ కు అండగా నిలిచారు.  జగన్ ఆదేశాలతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ జెత్వానిపై వేధింపులు చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కలేదు. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ జగన్ కు సన్నిహితుడు కావడమే. ఈ కేసులో ఎ వన్ ముద్దాయి కుక్కల విద్యాసాగర్.  దీంతో జెత్వానీ కేసులో అరెస్ట్ ల పర్వం మొదలైందనే అనుకోవాలి.