పేదల జోలికి వెళ్లని హైడ్రా

హైడ్రా బీద బిక్కి ప్రజానీకం మీద కరుణించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోడికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి పేదల ఇళ్లను ముట్టుకోవడం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లు, విల్లాలను హైడ్రా కూల్చేస్తుంది. మధ్య తరగతి ప్రజలను కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. కూల్చివేతలకు చట్టబద్దత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. తాజాగా కూకట్ పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ పరిధిలోని భూములలో నిర్మించిన కట్టడాలు కూల్చివేసినప్పటికీ పేద ప్రజల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. నల్ల చెరువు 27 ఎకరాల్లో ఉంటే ఇందులో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా తేల్చేసింది. 
అమీన్ పూర్ లో హైడ్రా అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగించింది. బాహుబలి మిషన్ ద్వారా పెద్ద భవంతులను హైడ్రా కూల్చివేసింది. మాదాపూర్ లో కూడా సోమవారం కూల్చివేసింది.  దుర్గం చెరువు  ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్ కూల్చివేతలను న్యాయస్థానం జోక్యంతో నిలుపదల చేసింది. 

తొలిసారి హైడ్రా జీహెచ్ ఎంసీ వెలుపల కూడా అక్రమ కట్టడాలను కూల్చేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద చెరువు, మాసాబ్ చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేయానికి హైడ్రా సిద్దమైంది.