పాన్ కార్డ్ ఆధార్ అనుసంధానం..సుప్రీంకోర్టు స్టే..
posted on Jun 9, 2017 3:57PM

పాన్ కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు పలికింది. కానీ ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆధార్ నంబరు లేనివారికి కూడా దీనిని తప్పనిసరిగా వర్తింపజేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రస్తుతం ఆధార్ లేనివారి పాన్ కార్డును చెల్లనిదిగా ప్రకటించరాదని స్పష్టం చేసింది. వ్యక్తిగత వివరాలు అక్రమంగా బయటపడకుండా నిరోధించేందుకు తగిన విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అనుసంధానంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు స్టే కొనసాగుతుందని కోర్టు తెలిపింది.