విజయసాయిరెడ్డికి ఘోర అవమానం... ప్రసంగం వినకుండానే ఇంటి బాట బట్టిన జనాలు 

చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో రావడం తథ్యమని ప్రజలు డిసైడ్ అయిపోయారు. వైసీపీ సభలకు జనం పలచనగా వస్తున్నారు. వైసీపీలో కీలక నేత అయిన విజయసాయిరెడ్డి అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపైనుంచి ప్రసంగించేందుకు సిద్ధపడగా జనం ఒక్కసారిగా లేచివెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ఇంటిముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకులు ప్రజలను వెళ్లొద్దని, విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని వేడుకున్నారు. భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని, పెద్దాయన (విజయసాయిరెడ్డి) మాట్లాడతారని ప్రచార రథంపై ఉన్న నేత మైక్‌లో ప్రకటించినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా.. వెనక్కి తిగి కూడా చూడలేదు ‘చెప్పేది వినండి, వెనక్కి రండి.. ఇటు చూడండి. వెళ్లిపోయేవాళ్లంతా మాకు కనిపిస్తున్నారు. మీరు పోవద్దు’ అని మైక్‌లో పదేపదే వేడుకోవడం కనిపించింది.